మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు : రామ్ చరణ్

SMTV Desk 2018-05-10 15:06:59  Ramcharan, boyapati srinu movie, rajamouli movie.

హైదరాబాద్, మే 10 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ బ్యాంకాక్ వెళ్లనుంది. చరణ్ ఈ సినిమా తర్వాత.. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారు. ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా నటించనున్నట్లు తెలుస్తో౦ది. కథంతా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని టాలీవుడ్ టాక్. ఈ విషయంపై చరణ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. "ఇలాంటి పుకార్లను నమ్మకండి. మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు. ఇది అద్భుతమైన గొప్ప చిత్రంగా ఉండబోతుందని మాత్రం చెప్పగలను. కనీసం సినిమా చిత్రీకరణ ఎప్పుడు ముగుస్తుందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే అది రాజమౌళి చిత్రం. అయితే ఇది బాక్సింగ్‌ నేపథ్యానికి సంబంధించిన సినిమా కాదని మాత్రం చెప్పగలను" అంటూ చెప్పుకొచ్చాడు.