వ్యాయామంతో శరీరానికి ఆరోగ్యం..

SMTV Desk 2018-05-10 13:47:06  exercise workouts, excersice tips, health tips, hyderabad

హైదరాబాద్, మే 10 : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో మన పని సమయాలు, పద్ధతులు మారిపోతున్నాయి. ఆహార అలవాట్లూ సరేసరి. వ్యాయామం చేసేదీ అంతంత మాత్రమే. ఇక నిద్ర తగ్గిపోవటం గురించి చెప్పాల్సిన పనేలేదు. మరి హార్మోనుల సమతుల్యతను పెంచుకుని ఆర్యోగంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. >> ఈస్త్రోజేన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు స్త్రీలకు చాలా కీలకమైనవి. నెలసరులూ, గర్భధారణ, భావోద్వేగాలూ, మోనోపాజ్ ను నియంత్రించేది ఈ హోర్మన్లే. సప్లిమెంట్ రూపంలో కాకుండా ఆహారంలో చేసుకొనే చిన్నమార్పులతో కూడా హోర్మన్ల అసమతుల్యతని తగ్గించుకోవచ్చు. >> జింక్ అధికంగా ఉండే పల్లీలు, ఒమెగా త్రీ అధికంగా ఉండే వాల్ నట్లు, గుడ్లూ, ఈ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. >> కొన్ని హార్మోన్లు అధికంగా విడుదల కావడం వల్ల మనలోని భావోద్వేగాలు మారిపోతుంటాయి. ఈ సమస్యకు ఏరోబిక్ వ్యాయామాలు చక్కని పరిష్కారం. ఇవి విడుదల చేసే రసాయనలను మనలోని వీపరితమైన భావోద్వేగాలని అదుపులో ఉంచుతాయి. >> ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్డిస్టాల్ హార్మోను విడుదల అవుతుంది. ఆ హోర్మను.. మనకు అవసరం అయిన ఈస్త్రోజేన్ విడుదలని అడ్డుకుంటుంది. అందుకే వీలైనంత వరకూ ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రయత్నించాలి. >> స్త్రీ హోర్మన్లతో పాటూ ఇతర కీలక హోర్మన్లు నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్, మన జీవ క్రియలను నియంత్రించే థైరాయిడ్. వీటి లోపం ఏర్పడితే ఒత్తిడి పెరిగి కీళ్లనొప్పులు దాడి చేస్తాయి. అందుకే.. మంచి నిద్రను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు.