సోనమ్ రిసెప్షన్‌.. షారుఖ్, సల్మాన్ ల సందడి..

SMTV Desk 2018-05-10 13:32:15  Sonam kapoor, marriage reception, sharukh khan, salman khan.

హైదరాబాద్, మే 10 : బాలీవుడ్ నటి సోనమ్ కపూర్.. ఆనంద్‌ ఆహుజాల పెళ్లి రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ ప్రముఖులు సందడి చేశారు. సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్యా రాయ్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, కత్రినా కైఫ్‌, అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్ తదితరులు ఈ వేడుకకు హాజరై సరదాగా ఎంజాయ్ చేశారు. సల్మాన్‌, షారుక్‌ లు సోనమ్ తల్లిని సునీతా కపూర్‌ను స్టేజి పైకి తీసుకువచ్చి పాట పాడుతూ ఆమెను ఆట పట్టించారు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న అనిల్ కపూర్.. రణ్‌వీర్‌ ను పట్టుకొని నవ్వుతూ కనిపించారు. ఇంతలో సునీతా కపూర్‌ సిగ్గుపడుతూ వేదిక దిగడానికి ప్రయత్నించగా సల్మాన్, షారుఖ్ ఆమెతో డాన్స్ చేయించడానికి ప్రయత్నించారు. ఇంతలో సోనమ్ వేదికపైకి వచ్చి తన తల్లికి సహకరించారు. ఈ వేడుకలో డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.