స్కూల్‌కి సాఫీగా..

SMTV Desk 2018-05-10 12:12:19  school chlidrens, ready to school childrens, peace mind to ready, hyderabad

హైదరాబాద్, మే 10 : స్కూల్ కు పిల్లలను తయారుచేయడం, బాక్సులు సర్దడం, పిల్లల్ని బడి దగ్గర దింపడం ఇలా ఒకటే పని.. ఇలా కాకుండా ప్రశాంతంగా పిల్లలను సిద్ధం చేయాలంటే... >> ఆలస్యంగా పడుకుంటే స్కూల్‌కి వెళ్లే సమయానికి పిల్లలు తగినంత నిద్రలేక చికాకుపడుతూ ఉంటారు. అందుకే ముందు రోజు త్వరగా నిద్రపుచ్చాలి. మర్నాడు ఉదయం చేసే టిఫిన్‌కీ, భోజనానికీ కావాల్సిన కూరగాయలను వీలైనంత వరకూ రాత్రే తరిగి పెట్టుకుంటే ఉదయం పూట చాలా సమయం మిగులుతుంది. కంగారు తగ్గుతుంది. కుదిరితే మూడు రోజులకు సరిపడా వండాల్సిన పదార్థాల తాలూకు ప్రణాళిక వేసుకుంటే మంచిది. >> చిన్నారులు చేసుకోగలిగే చిన్నచిన్న పనులను వారికే అప్పజెప్పండి. ఉదయం స్కూల్‌కి తీసుకెళ్లే పుస్తకాలూ, పెన్నులూ, పెన్సిళ్లు వంటివి రాత్రే సర్దుకోమనండి. షూపాలిష్‌ చేసుకోవడం, స్కూల్‌ డ్రెస్‌ సిద్ధం చేసుకోవడం, డైరీ చెక్‌ చేయించుకోవడం వంటివి రాత్రే అయిపోవాలి. >> ఉదయం పూట తప్పనిసరిగా చేయాల్సిన పనులకే ప్రాధాన్యం ఇవ్వండి. బ్రష్‌ చేసుకోవడం, స్నానం చేయడం, ఫలహారం తినడం లాంటివి. >> పిల్లల స్కూల్‌ బ్యాగులూ, డ్రెస్‌లూ, లంచ్‌ బాక్స్‌లూ.. వీటన్నింటినీ రోజూ ఒకేచోట పెట్టుకోవడంవల్ల మర్నాడు ఉదయం ఇది లేదు అది లేదు అని కంగారుగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. దీన్ని పిల్లలకూ అలవాటు చేయండి. వారి సామానులన్నింటినీ ఒక చోట పెట్టుకునేలా చూడండి. వీలైతే మీ స్కూటీ తాళం చెవి, బ్యాగూ, పోన్‌... ఇలా అన్నీ రోజూ ఒకేచోట పెట్టుకోండి.