అమ్మే కీర్తిని ఎంచుకుందేమో అనిపించింది..

SMTV Desk 2018-05-09 18:39:55  mahanati movie, savitri daughter, chaamundeshvari, producer ashvaneedath.

హైదరాబాద్, మే 9 : ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్.. సావిత్రి జీవితకథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. నేడు విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సావిత్రి కూతురు చాముండేశ్వరి.. చిత్ర నిర్మాత అశ్వినిదత్ తో కలిసి విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్‌ మాల్ లో సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "అమ్మ చిన్నతనం నుంచి అగ్ర కథానాయికగా ఎదిగిన తీరు చూడటం ఆనందంగా ఉంది. కీర్తి సురేష్‌ అమ్మ పాత్రలో చక్కగా ఒదిగి పోయి౦ది. అమ్మే కీర్తిని తన పాత్రకు ఎంచుకుందేమో అనిపించింది. నిజమైన అమ్మ కథ ఇప్పుడు అభిమానులకు తెలుస్తోంది. సినిమా చాలా అద్భుతంగా ఉందని" కొనియాడారు. చిత్ర నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత కథను చిత్రీకరించడం చాలా పెద్ద కోరికని.. 18 నెలల కృషి ఫలితం ఇప్పుడు అవిష్కృతమైందని తెలిపారు. ఆ మహానటి ఆత్మే ఈ చిత్రాన్ని దగ్గరుండి పూర్తి చేయించుకుందని అభిప్రాయపడ్డారు.