కీర్తి.. మీకు పాదాభివంద‌నం..

SMTV Desk 2018-05-09 17:46:15  mahanati movie, director atly, actor bramhaji comments.

హైదరాబాద్, మే 9 : మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ "మ‌హాన‌టి" రూపంలో నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ న‌టించిన విష‌యం తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి జీవించింద౦టూ ఆమెపై పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు స్టార్ డైరెక్టర్ అట్లీ, న‌టుడు బ్ర‌హ్మాజీ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "మహానటి క్లాసిక్, ఎమోషనల్, ఇన్స్పిరేషనల్ కలగలిపి సావిత్రి అమ్మ బయోపిక్. కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్‌ని మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చింది. స్పెషల్‌గా చెప్పాలంటే మాయాబజార్ డ్యాన్స్‌లో. సమంత నీ పెర్ఫార్మెన్స్ రాకింగ్. టీం మొత్తానికి కంగ్రాట్స్. ఇలాంటి మరచిపోలేని క్లాసిక్‌ని అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు వైజయంతి మూవీస్" అంటూ అట్లీ ట్వీట్‌లో పేర్కొన్నారు. న‌టుడు బ్ర‌హ్మాజీ.. "మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ అద్భుతం. కీర్తీ.. మీకు పాదాభివంద‌నం. మ‌ధురవాణిగా స‌మంత న‌న్ను ఏడిపించింది. నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. మాస్ట‌ర్ పీస్‌" అంటూ ట్వీట్ చేశాడు.