కేసీఆర్ నీచమైన రాజకీయాలు మానుకోవాలి: టీడీపీ

SMTV Desk 2018-05-09 15:58:03  Ap Tdp. secretary, counter by Telangana cm Kcr,

అమరావతి, మే 9: ఓటుకు నోటు కేసు పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన రాజకీయాలకు తెగబడుతున్నారని..టీడీపీ ఏపీ రాష్ట్ర కాపునాడు కార్యదర్శి కంకణాల పెంచలనాయుడు విమర్శలు గుప్పించారు.. అలాంటి నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే, ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కొందరు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీని నాశనం చేయాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబుపై ఓటుకు నోటు అభాండాలను వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ విజ్ఞతతో వ్యవహరించాలని, లేకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.