ఒత్తిడి ఉందా..? అయితే ఇలా చేయండి

SMTV Desk 2018-05-09 15:17:54  stress relief, cross word puzzles, stress avoid tips, hyderabad

హైదరాబాద్, మే 9 : ఆఫీస్ ఒత్తిడి కావచ్చు. చదువుల భారం అవ్వొచ్చు. వ్యక్తిగత సమస్యలు కావొచ్చు. కారణం ఏదైనా మనలో ఒత్తిడి పెరిగిపోతుంటుంది. లోలోన ఆందోళన, గాభరా వంటివి మొదలవుతాయి. కళ్లు మూసిన తెరిచినా అవే కనపడుతూఉంటాయి. వాటి నుండి ఉపశమనం పొందడానికి ఇలా చేసి చూడండి. >> క్రాస్ వర్డ్స్ పజిల్ తెలుసుగా! కాసేపు వాటిని ప్రయత్నించండి. మనసుకు ఊరటగా ఉంటుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు గుర్తుకు రాకుండా ఉంటాయి. >> పుస్తకాల్లో రంగులు నింపండి అనే కాలమ్ పిల్లలకు మాత్రమే అనుకోకండి. మీకు మంచి వ్యాయామమే అది. ఈ మధ్యకాలంలో కలరింగ్ మండలా పేరుతో ఆన్ లైన్ లో పుస్తకాలు దొరుకుతున్నాయి. ఓ సారి వాటి పని పట్టండి. >> దీర్ఘశ్వాస తీసుకొనే వదిలే ప్రాణాయామాలు ఒత్తిడి తాలుకూ గాభరాని తగ్గిస్తాయి. మనసుకు సాంత్వాన అందిస్తాయి. >> రోజువారీ ఆహారంలో కెఫీన్ లేకుండా జాగ్రత్త పదండి. ఒత్తిడి చాలా సులువుగా తగ్గుతుంది. >> మీలోని భావాలని మరీ అణిచిపెట్టయెద్దు. దానివల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు భావోద్వేగాలని యథాతథంగా స్వీకరించండి. >> వేడినీళ్ల స్నానం కూడా తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. లేదంటే మార్కెట్ లో దొరికే స్ట్రెస్ బంతిని తీసుకొని కాసేపు వ్యాయామంచేసి చూడండి. మనసు చాలా సులువుగా తేలిక పడుతుంది.