చేపగా హీరో నాని?

SMTV Desk 2017-07-07 18:14:02  nani, eega, rajamouli, fish, movie

హైదరాబాద్, జూలై 7 : బాక్సాఫీస్ వ‌ద్ద భారీ సంచలనాలను సృష్టించిన చిత్రం "ఈగ". రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత ఎన్నో గాసిప్స్ వినిపించాయి. ఈ సినిమాను స్పూర్తిగా తీసుకొని కొందరు దర్శకులు కీటకాలను ప్రధాన పాత్రలుగా పెట్టి సినిమా తీయాలనుకున్నారని, మరో వైపు నానిని తెరపై దోమగా చూపించనున్నారని అప్పట్లో జోరుగా ప్రచారాలు సాగాయి. ఇప్పుడు నాని తదుపరి చిత్రంలో చేపగా కనిపించనున్నాడని సరికొత్త ప్రచారం సాగుతోంది. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ తీయబోయే చిత్రంలో నాని చేపగా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి నానినే నిర్మాతగా వ్యవహరించనున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.