చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు: రోజా

SMTV Desk 2018-05-09 12:30:37  chandrababu government, rape cases, counter ycp Mla Roja

విజయవాడ, మే 9: రాష్ట్రంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనని ఇప్పటికైనా ఈ కేసు విచారణ వేగంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తన ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని... రేపొద్దున కాంగ్రెస్ అవసరం వస్తే ఉపయోగకరంగా ఉంటుందనే ఇలా చేశారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి కూడా పలువురు టీడీపీ నేతలను పంపించారని... ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అనే భావనతోనే ఇలా చేశారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటని, వైసీపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.