ఈ మార్పు మీకోసమే !

SMTV Desk 2018-05-09 12:16:21  job planing, job skills, hyderabad, job profile

హైదరాబాద్, మే 8 : ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎదగాలన్న తపన మనసులో ఉన్నా కొందరు ఎలా నెగ్గుకురావాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే ఎప్పటికప్పుడు వృత్తిగతంగానూ, వ్యక్తిగతంనూ మార్పుని ఆహ్వనించాలి. స్వీయ సమీక్ష : ఉద్యోగ జీవితంలో ఇమిడిపోవాలంటే చక్కని వ్యక్తిత్వంతో పాటు క్రమశిక్షణ చాలా అవసరం. దీనికి సరైన ప్రణాళికతో పాటు వృత్తి నైపుణ్యం, చలాకీతనం తోడుగా ఉంటే మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవడం పెద్దకష్టమేమి కాదు. ప్రణాళికబద్ధంగా : కొలువులో స్థిరపడ్డంకదా! ఇంకేం లక్ష్యాలుంటాయి అనుకోవడం పొరపాటు. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా లక్ష్యాలను ఏర్పరుచుకోవడం , దాన్ని సాధించే ప్రయత్నాలు చేయడం కొనసాగిస్తూనే ఉండాలి. పూర్తయిన స్థానంలో మరికొన్ని కొత్త లక్ష్యాలను చేర్చుకోవడం తప్పనిసరి. ఇవన్ని మీ ప్రతిభకు సానబెట్టేవే. మాటమీద నిలబడండి : కొత్త విషయాలు నేర్చుకోవడం మంచిదే కానీ, మీకు చేతకానివీ, మీరు చేయలేనివి చేయగలనని మీద వేసుకోవడం సరికాదు. వీలయితే వాటిని పూర్తి చేయడానికి కొంత సమయం తీసుకోండి. ఈ లోగా దానిపై అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మీరు నమ్మకంగా చేస్తానని చెప్పి వాటిని చేయలేకపోతే..అది మంచి పేరు తెచ్చిపెట్టదు సరి కదా! సమయానికి పనులు పూర్తి చేయరనే అపవాదును మీపై పడుతుంది. మీ అసమర్ధత బయట పడుతుంది. దీని వల్ల ఇతరులు మీపై నమ్మకాన్ని కోల్పోతారు. అంతటితో వదిలేయొద్దు : ఉద్యోగంలో చేరాక మొదట నేర్చోకోవల్సిన అనుశీలన ( ఫాలో అప్) . ఏదైనా పని వాయిదా పడినప్పుడు సగంలో ఆగిపోయినప్పుడు దాన్నక్కడే వదిలేయొద్దు. అప్పగించిన పని ఎంత చిన్నదైన సరే ఎప్పటికప్పుడు అనుశీలన చేయడం వల్ల మీరెంత బాధ్యతగా ఉంటున్నరాన్నది అర్థమవుతుంది. బాధ్యత మరవొద్దు : విధి నిర్వహణలో పొరపాట్లు అనేవి ప్రతి ఒక్కరికి సహజమే. అయితే అటువంటి సమస్యలు వచ్చినప్పుడు తడబడకుండా వాటిని సరిదిద్దుకొంటూ ముందుకు సాగాలి. జరిగిన తప్పులకు ఇతరులను బాధ్యుల్ని చేసి తప్పుకోవాలని చూడొద్దు. మరో సారి ఆ తప్పు చేయకుండా చేస్తే సరిపోతుంది.