మూడవ వారంలో "రాజుగాడు" ఆడియో

SMTV Desk 2018-05-08 18:23:24  rajugadu, amika dastoor, director sanjanaa reddy, producer rama bramham.

హైదరాబాద్, మే 8: యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు". ఈ చిత్రం ద్వారా సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం హైలైట్‌గా నిలవనుంది. అయితే ఈ చిత్ర ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల మూడవ వారంలో నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.