మొటిమలు తగ్గేందుకు చిట్కాలు..

SMTV Desk 2018-05-08 16:09:05  spots on face, spots avoiding tips, hyderabad, health tips

హైదరాబాద్, మే 8 : అందమైన ముఖంలో ఒక చిన్న మచ్చ వచ్చిన అమ్మాయిల మనసులో చాలా ఆందోళన చెందుతారు. అవి తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చిన్న చిన్న చిట్కాలతో వాటిని తగ్గించుకోవచ్చు. అవి మీ కోసం.. >> దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, పావు చెంచా పాలూ, చెంచా దాల్చిన చెక్క పొడీ, అరచెక్క నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకోవడానికి ముందు మొటిమలపై రాసి పావుగంటాగి కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమల ప్రభావం చాలామటుకూ తగ్గుతుంది. >> బొప్పాయిలో ఉండే ఏ, సి విటమిన్లూ, ఇతర పోషకాలు చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తాయి. జిడ్డుని అరికట్టి మొటిమల్ని అదుపులో ఉంచుతాయి. బొప్పాయిపండు గుజ్జుకు కాసిని పాలు కలిపి ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. ఇలా రెండురోజులకోసారి చేస్తుంటే.. సమస్య చాలామటుకూ తగ్గుతుంది. >> గుడ్డులోని తెల్లసొనను ముఖానికి రాసి, నిదానంగా మర్దన చేయాలి. అది పూర్తిగా ఆరాక.. చన్నీళ్లతో కడిగేస్తే చాలు. మొటిమలు తగ్గడమే కాదు.. చర్మం కూడా బిగుతుగా తయారవుతుంది. >> అరటిపండు తొక్కలో ల్యూటిన్‌ అనే ఎంజైము ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొత్త కణాలు ఏర్పడేందుకు సాయపడుతుంది. అరటిపండు తొక్కని మెత్తగా చేసి దానికి అరచెంచా చక్కెర కలిపి ముఖానికి రాసుకుని సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి.