భారత్ పై చైనా వైఖరి

SMTV Desk 2017-07-07 17:26:49  bharath, chaina, sikkim, bhutan, subhash bhambre, attitude, Soldiers

న్యూఢిల్లీ, జూలై 7 : భారత్-చైనాల మధ్య సిక్కిం సెక్టార్ లో నెలకొన్న ఉద్రిక్తతలను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవచ్చని భారత్ పేర్కొంది. ఈ మేరకు సిక్కిం ప్రాంతంలో ఉద్రిక్తతలను తొలగించేందుకు చైనా సైనికులు భూటాన్ భూభాగాన్ని వదిలి వెళ్లాలని సూచించింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుభాష్ భామ్రే గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, చైనా సైన్యాలు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తిరిగి వెళ్లాలని సూచించారు. భూటాన్ భూభాగంలోకి చైనా చొచ్చుకొని పోతున్నట్లు, వారు ఏ మాత్రం ముందుకు రాకూడదని ఆయన వెల్లడించారు. కానీ చైనా మాత్రం ఇదే మా వైఖరి అంటూ తమ సైన్యాలు భూభాగంలోకి వస్తున్నాయని భూటాన్ రాజు బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ ఉద్రిక్తతలను దౌత్య స్థాయిలో చర్చించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు. పంచశీల ఒప్పంద సూత్రాలను భారత్ కాలరాస్తున్నదంటూ చైనా అధికార మీడియా ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి దీనిపై స్పందించారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందిస్తూ భారత దళాలు వెనక్కు వెళ్లినప్పుడు మాత్రమే యథాతథ స్థితి పునరుద్ధరణ జరుగుతుందన్నారు.