పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అంతేనా.. : వర్మ

SMTV Desk 2018-05-08 11:30:13  ram goapal varma, twitter, pawan kalyan, pffiser teaser.

హైదరాబాద్, మే 8: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో వార్ స్టార్ట్ చేసి ఇక నుండి పవన్ ను అతని కుటుంబాన్ని ఏమి అననని ఒట్టేసి ఆ తర్వాత ఒట్టుతీసి గట్టు మీద పెడుతున్నా అంటూ హడావుడి చేశారు. తాజాగా ట్విట్టర్ లో మళ్ళీ యుద్ధానికి దిగాడు. ఇంతకీ మళ్ళీ ఈ యుద్ధానికి దారి తీసి తీసింది ఎలా అనుకుంటున్నారా.? నాగార్జున తో తెరకెక్కించిన ఆఫీసర్ సినిమా టీజ‌ర్‌. యూట్యూబ్ లో ఆఫీసర్ టీజర్‌ కు 11 వేల డిస్‌లైక్‌లు వ‌చ్చాయి.. దీంతో వర్మ తన ట్విట్టర్ లో రెచ్చిపోయారు. "ఆఫీసర్ టీజర్ కు కేవలం 11 వేల డిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి. అంటే పవన్ ప్యాన్స్ అంతేనా. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నా. 11 కోట్ల మంది తెలుగు ప్ర‌జ‌ల్లో 11 వేల మంది మాత్ర‌మే అభిమానులున్నారంటే.. జ‌న‌సేన పార్టీ ఈ విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచించాలి. లేదంటే ప్రజారాజ్యంలా పరాజయం పాలవక తప్పదు" అంటూ ట్వీట్ చేశాడు.