ఓటు తెచ్చిన కష్టాలు

SMTV Desk 2017-07-07 16:35:50  odissa, vote, Sentenced

భువనేశ్వర్: ఒడిశాలో ఓ ఆటవిక సంఘటన చోటు చేసుకుంది. అనుగుల్ జిల్లాలోని రగుడిపడా గ్రామంలో మల్లిక సాహు అనే వార్డు సభ్యురాలు గ్రామంలోని కమిటీ సభ్యులు బలపరిచినవారిని కాదని వేరే వ్యక్తికి ఓటు వేసినందుకు, గ్రామ సభ్యుల నిర్ణయానికి కట్టుబడకుండా వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు 50 వేల జరిమానా విధించారు. సకాలంలో ఆమె డబ్బు చెల్లించక పోయేసరికి, గ్రామ సభ్యులు ఆమె భర్త దుష్మంత్‌ సాహును పిలిచి మల్లిక సాహు తప్పు చేసిందని ఊరంతా చాటింపు వేయాలని తీర్పిచ్చారు. దీంతో మల్లిక భర్త దుష్మంత్‌ సాహు తీవ్ర అవమాన భారంతో కుంగిపోయారు. జయగంట కొడుతూ పంచాయతీలోని గ్రామాలలో తిరుగుతూ గ్రామ కమిటీ సూచించినట్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.