హ్యాట్సాప్ సూర్య..

SMTV Desk 2018-05-06 12:58:15  HERO SURYA, AGARAM FOUNDATION, SOCIAL SERVICES.

చెన్నై, మే 6 : హీరో సూర్యకు తమిళనాటనే కాకుండా తెలుగులో సైతం అశేష అభిమానులున్నారు. ప్రతి నిత్యం ఎన్నో పనులు, షూటింగ్ లతో జిజీగా ఉండే సూర్యకు సేవా దృక్పథం చాలా ఎక్కువ. ఇందుకోసం "అగరం" అనే ఓ ఫౌండేషన్ ప్రారంభించిన సూర్య.. పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అనాథలను, పేద చిన్నారులను ఆదరించి వారికి విద్యా బుద్దులు నేర్పిస్తున్నారు. అయితే తాజాగా ఈ సేవా కార్యక్రమాలతో పాటు ప్రతీ ఏడాది 500 మంది కాలేజీ విద్యార్థులకు ఆర్ధికంగా సహాయం చేయబోతున్నామని ప్రకటించారు సూర్య. దీంతో అభిమానులు సూర్య నిజమైన హీరో అంటూ తెగ మురిసిపోతున్నారు. హ్యాట్సాప్ సూర్య అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంతేకాదు ఈనాటి రాజకీయవేత్తలు సూర్యను చూసి నేర్చుకోండి అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.