పాశ్చాత్య దేశాలను ప్రశ్నించిన ట్రంప్

SMTV Desk 2017-07-07 15:33:15  american, president, trump,

వార్సా, జూలై 7 : పాశ్చాత్య దేశాలకు ట్రంప్ సూటి ప్రశ్నలను సంధించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదంతో పాశ్చాత్య దేశాలకు బతికే ధైర్యం ఉందా, లేదా? అని ఆయన ప్రశ్నించారు, జర్మనీలో జి-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు హ్యాంప్‌షైర్‌కు చేరుకున్న ట్రంప్.. గురువారం పోలండ్‌ రాజధాని వార్సాను సందర్శించారు. క్రసిన్‌స్కీ స్వేర్‌లో పౌరులనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఉగ్రవాద శకంలో బతికే ధైర్యం, బతకాలన్న సంకల్పం మనకున్నాయా?, మన సరిహద్దులను కాపాడుకోవడానికి మన పౌరులంటే మనకు గౌరవం ఉందా? లేదా?, మనలను ధ్వంసం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల నుంచి మనల్ని మనం రక్షించుకోగల ధైర్యం, రక్షించాలన్న కోరిక మనకు ఉన్నాయా? అని ఉద్వేగభరితంగా ప్రసంగించారు.