అలరిస్తున్న ఖుషి కపూర్ స్టైల్..!!

SMTV Desk 2018-05-05 18:26:02  khushi kapoor, sreedevi daughter, khushi kapoor style, instagram.

హైదరాబాద్, మే 5 : అలనాటి దివంగత తార శ్రీదేవి కుమార్తెలకు సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డులలో "మామ్" సినిమాలో శ్రీదేవి నటనకు అవార్డు వరించింది. ఈ అవార్డును అందుకోవడానికి బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్వీ శ్రీదేవి చీరలో దర్శనమివ్వగా.. ఖుషి లంగాఓణీ లో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అనంతరం ఢిల్లీ నుండి ఖుషి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటో, అందుకు సంబంధించిన వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి౦ది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా అవార్డుల కార్యక్రమానికి ఖుషి ధరించి లంగాఓణీ కూడా శ్రీదేవి ఓ సందర్భంలో ధరించిన లంగాఓణీ లాగే ఉందంటూ కొలేజ్‌ ఫొటో వైరల్‌ అయ్యింది.