చాలా ఆనందంగా ఉంది : వర్మ

SMTV Desk 2018-05-05 17:57:32  varma, officer teaser, nagarjuna, youtube trending.

హైదరాబాద్, మే 5 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం "ఆఫీసర్". ఈ చిత్రానికి సంబంధించి రెండవ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇదివరకే ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ఈ టీజర్ యూట్యూబ్ ట్రెండి౦గ్ లో మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వర్మ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు నాగార్జున ఎప్పుడు యాక్షన్ హీరోలనే కనపడతారు. ఈ టీజర్ ప్రేక్షకులను నచ్చడం ఆనందంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై వర్మ, సుధీర్‌ చంద్ర సినిమాను నిర్మిస్తున్నారు. మే 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.