"నా పేరు సూర్య" తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా..!!

SMTV Desk 2018-05-05 17:45:36  na peru surya, allu arjun, vakkatham vamshi, first day collections.

హైదరాబాద్, మే 5 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య". అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుండి మిశ్రమ స్పందనను రాబట్టి౦ది. ఈ చిత్రం తోలిరోజు కలెక్షన్లను చూసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు సమాచారం. ఈ మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్ళు మాత్రమే. అయితే గతంలో రిలీజైన అల్లు అర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఏకంగా తొలిరోజున 17.9 కోట్లు షేర్ వసూలు చేసింది. మరి వీకెండ్స్ లో విడుదలైన ఈ చిత్రం ఈ రెండు రోజుల్లో మరిన్ని కలెక్షన్లతో దూసుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.