విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ దాడి

SMTV Desk 2018-05-05 15:47:32   College Director Arrested For Beating Students

విజయవాడ : కానూరులోని విశ్వ అకాడమీ హాస్టల్‌ విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్‌లో చోరీ జరగడంతో డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన డైరెక్టర్‌ ఫణి కుమార్‌ ఐదుగురు విద్యార్థులపై పీవీసీ పైపులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జానకి రాం, తిరుమల్‌ అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారు రేపు జరిగే నీట్‌ పరీక్షకు హాజరవడంపై సందేహాలు నెలకొన్నాయి. మద్యం మత్తులో ఉన్న ఫణి కుమార్‌ తమపై దాడి చేశాడంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడి చేసిన కారణంగా అతడిపై 324, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.