బాలికపై ఇంటర్ విద్యార్థుల అత్యాచారం!

SMTV Desk 2018-05-05 14:51:30  Giral, rape case, arrested, inter studets,

కడప, మే 5: కడప జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇంటర్ మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం బద్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ బాలికపై ఇంటర్ చదువుతున్న విద్యార్థులు రమేష్, కృష్ణ .. ముళ్లపొదల్లోకి ఆ బాలికను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్యచికిత్సల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. .