లేడి ఓరియె౦టెడ్ చిత్రంలో హన్సిక..!!

SMTV Desk 2018-05-05 12:48:34  HANSIKA, LADY ORIENTED MOVIE, JAMAL DIRECTOR.

హైదరాబాద్, మే 5 : టాలీవుడ్ కథానాయిక హన్సిక లేడి ఓరియె౦టెడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు నయనతార, అనుష్క కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా వారి బాటలోనే హన్సిక అడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా దర్శకుడు జమాల్‌ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. యాక్షన్‌, థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకోనున్న చిత్రంలో కథానాయిక పాత్ర చాలా కీలకం కావడంతో హన్సికను సంప్రదించారట. అయితే జూన్‌లో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 55 రోజుల చిత్రీకరణ జరపాలని.. ఇందులో 25 రోజులు ఐరోపాలో షూటింగ్‌ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.