శరీరానికి నప్పేలా..

SMTV Desk 2018-05-04 16:10:16  facebook, foundation pack, hyderabad, face beauty tips

హైదరాబాద్, మే 4 : తరచూ అలంకరణ చేసుకునేవారు.. మొదట రాసుకోవాల్సింది ఫౌండేషనే. అయితే దాన్ని ఏదో ఒకటి ఎంచుకోవడం కాకుండా.. వేసుకోవడంలోనూ మరికొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. * ఎప్పుడయినా సరే.. ఫౌండేషన్‌ని కొంటున్నప్పుడు.. దాన్ని నేరుగా ముఖానికి రాసుకోకూడదు. కొద్దిగా తీసుకుని దవడ కింది భాగంలో రాసుకుని సహజ వెలుతురులో చూసుకోవాలి. అది చర్మరంగులో కలిసిపోతే.. సరే లేదంటే మరోదాన్ని ప్రయత్నించడం మంచిది. * ఫౌండేషన్‌ కన్నా ముందు.. కొద్దిగా మాయిశ్చరైజర్‌ ముఖానికి రాసుకోవాలి. అప్పుడే అది చక్కగా పరుచుకుంటుంది. కళ్ల అడుగున మాత్రం.. దాన్ని కన్సీలర్‌ బ్రష్‌తో అద్దుకుంటే.. నల్లని వలయాలు కనిపించకుండా ఉంటాయి. అదనంగా కన్సీలర్‌అవసరం కూడా తగ్గుతుంది. * ఈ సమయంలో నీటి ఆధారిత ఫౌండేషన్‌ని ఎంచుకోవడం మంచిది. చాలామంది వేళ్లతో రాసుకుంటారు కానీ.. బ్రష్‌తో అయితే మంచిది. అది కూడా ఎలా పడితే అలా కాకుండా.. ముఖమంతా అక్కడక్కడా చిన్నచిన్న చుక్కల్లా పెట్టుకుని ఆ తరవాత రాసుకోవాలి. ఒకవేళ బ్రష్‌ అందుబాటులో లేకపోతే స్పాంజిని ఎంచుకోవడం మంచిది. * దీని తరవాత అదనంగా అలంకరణ చేసుకోవాలని లేదు. కొద్దిగా పౌడర్‌ రాసుకున్నా చాలు. ప్రత్యేక సందర్భాల్లో ఆకట్టుకునేలా కనిపిస్తారు. * ఫౌండేషన్‌తోపాటూ సన్‌స్క్రీన్‌కూడా రాసుకోవాలా అనుకునేవారికి.. ఓ పరిష్కారం ఉంది. ఎస్‌పీఎఫ్‌ ఉన్న ఫౌండేషనే దొరుకుతుంది. దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.