జమ్ముకాశ్మీర్ లో హై అలర్ట్?

SMTV Desk 2017-07-07 13:18:19  jammu kashmir, armi, police, high, alert

జమ్ముకాశ్మీర్, జూలై 07 : ఉగ్రవాదులు ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మేరకు జమ్ముకాశ్మీర్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. యువకులను తన సంస్థలో చేర్చుకునేందుకు ఉగ్రవాదులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయం కారణంగా దక్షిణ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను, కరెంట్ ను నిలిపివేశారు. పోలీసు స్టేషన్ల నుంచి ఆయుధాలను తొలగించాలని 200 మంది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది తెలుసుకున్న పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.