దాచేపల్లి నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య

SMTV Desk 2018-05-04 15:13:57  Dachepally, minor girl, rape case, subbaiah, sucide

దాచేపల్లి, మే 4: గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దైదా దగ్గర అమరలింగేశ్వర దేవాలయం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సుబ్బయ్యేనని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మరోవైపు, సుబ్బయ్య ఉరివేసుకున్నది ఎప్పుడనేది వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ తెలిపారు.