తినండి.. తగ్గండి

SMTV Desk 2018-05-04 13:24:01  health tips, reduce weight, food rules, hyderabad

హైదరాబాద్, మే 4 : పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు ఎన్నో నియమాలు పాటిస్తారు. అందులో కొంత మంది తిండి మానేయడం, వ్యాయామాలు చేయడం చేస్తారు. ఇవి మాత్రమే పరిష్కారాలు కావు. సంతోషంగా తినండి.. బరువు తగ్గే చిట్కాలు.. >> ఉదయం ఎన్ని పనులున్నా సరే.. టిఫిన్ తినడం అలవాటుగా మార్చుకోండి. అందులోనూ మాంసకృత్తులున్న ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. >> భోజనానికి ముందు.. ఒక కీరా, క్యారెట్‌ తిన్నా చాలు.. మిగిలిన పదార్థాలను మితంగా తీసుకోవచ్చు. అలా తక్కువ అన్నంతో పొట్ట నింపేసుకోవచ్చు. >> చాలాసార్లు దాహంగా అనిపించినప్పుడు ఆకలి అనుకుని ఏదో ఒకటి తినేయడానికి చూస్తాం. ఈ సారి ఆ పని చేయకండి. ముందు గ్లాసు మంచినీళ్లు తాగి చూడండి. ఆకలి తగ్గితే సరి. లేదంటే.. అప్పుడు ఓ పండో, పండ్లరసమో, గ్రీన్‌టీనో తీసుకోండి.