దాచేపల్లి బాధితురాలికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

SMTV Desk 2018-05-04 11:31:10  Dachepally, incident, Rs. 5 lakhs, exgraeia

గుంటూరు, మే 4: గుంటూరు జిల్లా దాచేపల్లిలో ముక్కుపచ్చలారని ఒక బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశారు. చిన్నారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నిన్న బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే యరపతినేని వ్యక్తిగతంగా రూ.2.5 లక్షల సాయం అందజేశారు. మరోవైపు ఈ ఘటనలో నిందితుడు సుబయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.