పాస్‌వర్డ్‌లు ఛేంజ్ చేసుకోండి : ట్విటర్‌

SMTV Desk 2018-05-04 11:09:59  twitter account, twitter passwords, microbloging site, twitter

శాన్‌ఫ్రాన్సిస్‌కో, మే 4: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్ ట్విటర్‌ తమ వినియోగదారులను ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని కోరింది. కొద్ది రోజుల క్రితం ట్విటర్‌లో ఉన్నట్టుండి సమస్య తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ జరిగిందా?, మరేదైనా సమాచార దుర్వినియోగం జరిగిందా? అనే అంశంపై విచారణ చేసింది. అయితే అంతర్గత దర్యాప్తులో పాస్‌వర్డ్‌ల చోరీ జరిగినట్లు గానీ, దుర్వినియోగం జరిగినట్లు గానీ ఎలాంటి సంకేతాలు కనిపించలేదని వెల్లడించింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా తమ పాస్‌వర్డ్‌లు ఛేంజ్ చేయాలనీ సూచించింది. దాదాపు 330 మిలియన్‌ మంది వినియోగదారులు తమ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సంస్థ కోరింది.