హోదా సాధించే వరకూ ఉద్యమం ఆగదు

SMTV Desk 2018-05-04 11:05:17  Ap special status, demand, venu madhav, cycle rali

అనంతపురం, మే 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హోదా సాధించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని సినీనటుడు వేణుమాధవ్‌ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని కిరికెర నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభం సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు స్ఫూర్తితో సైకిల్‌ యాత్రలో పాల్గొన్నట్టు వేణుమాధవ్‌ పేర్కొన్నారు.