జీవిత౦లో నా పర్పస్ ఒకటే.. : విజయ్ దేవరకొండ

SMTV Desk 2018-05-03 17:38:02  vijay devarakonda, mahanati movie still, samantha,

హైదరాబాద్, మే 3 : నిత్యం సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో "మహానటి" చిత్రంలో పాత్రికేయుడిగా నటించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక చిత్రాన్ని విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి దానికి ఒక కామెంట్ జోడించారు. సమ౦త తో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసి.. "నా జీవిత౦లో పర్పస్ ఒకటే. నవ్వుతూ.. నవ్విస్తూ జీవించాలి" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు అభిమానుల నుండి విభిన్నమైన కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. "నీ కామెంట్ తో మేము అంగీకరిస్తామని ఒకరు", "నువ్వు నవ్వుతు ఉండాలి. ఎందుకంటే నవ్వుతుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు" అంటూ మరొకరు ఇలా అభిమానుల నుండి కామెంట్లు వస్తున్నాయి.