చారిత్రాత్మక చిత్రంలో శర్వానంద్..!!

SMTV Desk 2018-05-03 15:23:51  sharvanandh, historical movie, director srinivasaraju.

హైదరాబాద్, మే 3 : కథానాయకుడు శర్వానంద్.. సరికొత్త కథలను ఎంపిక చేసుకొని తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా.. ఒక పిరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు లవ్ స్టోరీ కథలలో, కుటుంబ కథా చిత్రంలో ఒదిగిపోయిన శర్వా... చారిత్రాత్మక కథ నేపథ్యంలో నటించడం ఇదే తొలిసారి. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు శ్రీనివాసరాజు.. శర్వా కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఇంతకి శర్వానంద్ ఒప్పుకున్నాడో..! లేదో..! ఒకవేళ ఒప్పుకుంటే ఈ పిరియాడిక్ డ్రామాను పట్టాలెక్కించనున్నారు.