వాయిదా... కొన్ని సార్లు మంచిదే

SMTV Desk 2018-05-03 14:06:52  pending works, pending works some tips, hyderabad, emplyoees, women

హైదరాబాద్, మే 2 : ఉద్యోగం.. ఎన్నో బాధ్యతలు, బరువులు, అలాంటి పనుల్లో కొన్ని అనుకున్న సమయానికి జరగవు. ఈ లోగా ఆందోళన ఎక్కువైపోతుంది. దాంతో దాంతో మరిన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మీకు అలాంటి పరిస్థితి వస్తే ఇలా చేయండి. >> ఒకేసమయంలో ఎక్కువ పనులు చేయడంలో మహిళలు సమర్థులంటారు! కానీ ఆ అలవాటు అన్ని సమయాల్లోనూ మంచిదికాదు. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు! ఇలాంటప్పుడు కేవలం ఒక్క పనిలో మాత్రమే దృష్టిపెట్టండి. వరుస క్రమంలో పనులు జాబితా రాసుకొనే చేస్తే ఒత్తిడి మటుమాయం అవుతుంది. >> వాయిదా కొన్నిసార్లు మంచిదే! మీకు ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు ఇది తప్పదు కూడా. వాటివల్ల కంగారు కొంతవరకూ తగ్గుతుంది. ఉత్సాహంగా మిగతా పనులు పూర్తిచేయగలిగితే అనుకున్నదానికంటే ముందే మీరు వాయిదావేసిన పనులు మొదలుపెట్టొచ్చు. >> ఒక్కోసారి ఒత్తిడితో కూడుకున్న పనులు రెండుమూడురోజులు కూడా కొనసాగొచ్చు. అలాంటప్పుడు రోజుకి కనీసం గంటైనా ఏదైనా వ్యాయామం చేయండి. అది ఆందోళన ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఒత్తిడిని తట్టుకుంటూ పనిచేయగలిగేలా శ్రద్ధని పెంచుతుంది.