ఆసీస్ నూతన కోచ్ గా లాంగర్‌

SMTV Desk 2018-05-03 12:49:32  justin langer, australia new coach, ball tampering, cricket australia

సిడ్నీ, మే 3 : ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన బాల్ టాంపరింగ్ వివాదంతో ఆ దేశ క్రీడాప్రతిష్ట దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ మరకల నుంచి ఆస్ట్రేలియా జట్టును బయటపడేసేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నూతన కోచ్ గా జస్టిన్‌ లాంగర్‌ను నియమించింది. 47 ఏళ్ల ఈ మాజీ ఆటగాడు రెండు యాషెస్‌ సిరీస్‌లు కైవసం చేసుకోవటంలో ఆస్ట్రేలియా తరపున ముఖ్య భూమిక పోషించారు. ఒక వరల్డ్‌ కప్‌, టీ-20 వరల్డ్‌ కప్‌ సాధనలో జట్టు భాగస్వామిగా ఉన్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌ నేపథ్యంలో ఆటగాళ్లు స్టీవ్ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఏడాది పాటు, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌ పై 9 నెలలు వేటు పడగా.. ఒత్తిళ్ల నేపథ్యంలో కోచ్‌ డారెన్‌ లెహ్‌మన్‌ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం కొత్త కోచ్‌ కోసం పలువురి పేర్లను సీఏ ప్రతిపాదించగా.. రాజకీయాలు మొదలయ్యాయి. చివరకు వివాదరహితుడిగా పేరొందిన లాంగర్‌ను కోచ్ గా నియమించారు.