అల్లు అర్జున్ క్యాప్ ట్రిక్స్ చూశారా...!

SMTV Desk 2018-05-03 12:31:24  allu arjun, cap tricks, na peru surya movie, vakkatham vamshi.

హైదరాబాద్ , మే 3 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యాప్ ట్రిక్స్ చూశారా.? ఇంతకి ఏంటది అనుకుంటున్నారా.! అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్ర౦లో "లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో".. అంటూ సాగే పాటలో క్యాప్ తో ఒక స్టెప్ ఉంటుంది. ఈ పాటలో క్యాప్ స్టెప్ కోసం బన్ని ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ట్రిక్స్ కోసం బన్ని చాలా కష్టపడ్డాడని చిత్ర యూనిట్ పేర్కొంది. చాలా రోజుల సమయం పట్టే దానిని అల్లు అర్జున్ కేవలం మూడు నెలల్లో నేర్చుకున్నారని తెలిపారు. బన్ని నిబద్ధతపై దర్శకుడు వక్కంతం వంశీ ప్రశంసలు కురిపించారు. పని రాక్షసుడు అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతంగా చేశావు బన్ని అంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.