ఫోన్ మాన్పించండిలా..

SMTV Desk 2018-05-03 11:53:48  mobile phone aviod, using mobile phone children, smart phones, hyderabad

హైదరాబాద్, మే 2 : ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరి చేతిలో ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. ముఖ్యంగా పిల్లలు ఫోన్ లకు బాగా అలవాటు పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. చిన్నారులు మొబైల్ ఫోన్లకి దూరం పెట్టాలంటే ఏకైక పరిష్కారం. తెర సమయాన్ని నియంత్రించడమే. రోజుకి గంటపాటు మాత్రమే పిల్లలు వాటిని చూసేలా జాగ్రత్త పడాలి. >> అసలైన ఆటల్ని పరిచయం చేయండి. స్నేహితులతో ఆడుకోవడం వల్ల ఏయే విషయాలు నేర్చుకుంటారో ఎంత ఆనందంగా ఉంటుందో చవిచూపండి. దారిలోకి వస్తారు. >> తల్లిదండ్రులు మీరూ మొదట వీటిని పరిమితంగా ఉపయోగించండి. కేవలం ఆఫీస్ అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో తప్పవాటిని వాడటం లేదని పిల్లలకి తెలిసేలా చూడండి. కాస్త ఖాళీ దొరికితే వారికి నచ్చిన పాటకు డ్యాన్స్ చేయడమో, అందుబాటులో ఉన్న కథల పుస్తకాలివ్వండి.