ఒక్క యాక్షన్ ఘట్టానికే 90 కోట్లా..!!

SMTV Desk 2018-05-03 11:51:05  SAHO MOVIE, FIGHT SEAN, O90 CRORES BADJET, PRABHAS.

హైదరాబాద్, మే 3 : ఒక సినిమా కోసం రూ.90 కోట్లు ఖర్చు పెట్టడం సర్వ సాధారణమే. ఈ మధ్య కాలంలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు దాదాపు అంత బడ్జెట్ తోనే అనేది తెలిసిందే. కాని అక్షరాలా 90 కోట్లు కేవలం ఒక యాక్షన్ ఘట్టానికే అంటే నమ్ముతారా.? షాకింగ్ గా ఉంది కదూ.. కాని ఇది నిజం. యాంగ్ హీరో రెబల్ స్టార్.. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన "సాహో" చిత్రానికి సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా 90 కోట్లతో యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే ఇది ఒక సంచలనం. ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. "సాహో" లో భారీ ఫైట్‌ని హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్లు తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రీకరణ ఉండాలన్న ఆలోచనతో ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నామని యూవీ క్రియేషన్స్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ప్రముఖ బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.