విలన్ గా రాజశేఖర్ ..!!

SMTV Desk 2018-05-02 14:25:41  RAJASHEKHAR, RAM, DIRECTOR PRAVEEN SATTAARU.

హైదరాబాద్, మే 2 : యాంగ్రీమాన్ రాజశేఖర్ "గరుడవేగ" చిత్రంలో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. తాజాగా ఆయన మరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తెరకేక్కిన్చానున్న మూవీలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎ సినిమా కోసం "కల్కి" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా యంగ్ యనర్జిటిక్ హీరో రామ్‌ - ప్రవీణ్‌ సత్తారు కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారట. గత కొంత కాలంగా రాజశేఖర్ విలన్ గా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రవీణ్‌ చెప్పిన కథని ఓకే చేసేశాడని తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ నుండి స్పష్టత వచ్చే వరకు ఆగాల్సిందే.