హాలీవుడ్ ప్రాంతీయ చిత్ర పరిశ్రమను నాశనం చేస్తోంది..

SMTV Desk 2018-05-02 12:45:09  amitab bacchan, 102 not out, promotion, hollywood topic.

ముంబై, మే 2 : ప్రపంచమంతా హాలీవుడ్ వ్యాపిస్తోందని.. ఒక్క హాలీవుడ్ ప్రాంతీయ చిత్ర పరిశ్రమను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. బిగ్ బి ప్రధాన పాత్రలో నటించిన "102 నాటౌట్" చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో హాలీవుడ్ ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. వారి వద్ద క్వాలిటీ, క్వాంటిటీ, అనుభవం ఉన్నాయి. అది ఇటలీ, ఇంగ్లాండ్ లే కావొచ్చు. దీంతో ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు నాశమైపోతున్నాయని అన్నారు. కావున ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్‌ విభిన్న కథాంశాలతో సినిమాలు తీసుకురావాలని... సాంకేతికత పరంగా చూసుకుంటే బాలీవుడ్ హాలీవుడ్ కు ఏమాత్రం సరిపోదు. కాని యువ దర్శకనిర్మాతలు హాలీవుడ్ తరహాలో సినిమాలు తీస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి హాలీవుడ్ ను ఎక్కువగా ప్రోత్సహించకండి అది మన ప్రాంతీయ చిత్ర పరిశ్రమను నాశనం చేస్తుంది" అంటూ వెల్లడించారు.