జిమ్‌ డ్రెస్సింగ్‌.. కొన్ని నియమాలు

SMTV Desk 2018-05-02 11:44:24  gym rules, gym dress, gym tips, hyderabad

హైదరాబాద్, మే 2 : ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించడానికి యోగా, జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయటం మీదే దృష్టి పెడుతున్నారు. కానీ అందుకోసం వేసుకోవలసిన దుస్తులు, షూ గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వ్యాయామం సౌకర్యంగా ఉండాలన్నా, వ్యాయామం వల్ల శారీరక సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా జిమ్‌ డ్రస్సింగ్‌లో కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే... షూ: సింపుల్‌ వర్కవుట్‌కి ఉపయోగపడే బేసిక్‌ రన్నింగ్‌ షూస్‌ వేసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో కాలి కీళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే మేలు రకం స్పోర్ట్స్‌ షూ వేసుకోవటం తప్పనిసరి. హుడీ: హుడీ వేసుకోవటం అలవాటున్నా లేకపోయినా అప్పుడప్పుడూ వేసుకుని వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇది వేసుకుని వ్యాయామం చేయటం వల్ల చమట ఎక్కువగా పట్టి అదనపు కిలోలు తరుగుతాయి. చమట పీల్చుకునే టీషర్ట్‌: ట్రైనింగ్‌ టీషర్ట్స్‌ ఎంచుకోవాలి. వ్యాయామం చేయటం వల్ల చెమట పట్టి, ఆ చమటతో టీషర్ట్‌ తడిసిపోతే...అలాగే వర్కవుట్‌ చేయటం మనతోపాటు పక్కనున్నవాళ్లకూ అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి స్వెట్‌ రెసిస్టెంట్‌ మెటీరియల్‌తో తయారైన టీషర్ట్‌నే వేసుకోవాలి. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌: ఫిట్‌నెస్‌ గురించి అప్‌ టు డేట్‌ ఉండాలంటే ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ధరించాలి. గుండె కొట్టుకునే వేగం, ఖర్చయ్యే కెలోరీల లెక్క తెలియటం కోసం జిమ్‌కి వెళ్లేటప్పుడు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ని వెంట తీసుకెళ్లండి. తాజా సాక్స్‌: వారం మొత్తానికి సరిపడా ఏడు జతల సాక్స్‌ ఉంచుకోవాలి. రోజూ సాక్స్‌ మారుస్తూ ఉంటే అవి దుర్వాసన రాకుండా ఉంటాయి. పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుంది.