నా భార్యకు అండగా నేనున్నా.. బెదిరిస్తే ఊరుకునేది లేదు..

SMTV Desk 2018-05-02 11:35:43  akshay kumar, twinkle kannaa, nayi dress, rustum novie.

ముంబై, మే 2 : ప్రముఖ నేవీ అధికారి కేఎమ్‌ నానావతి జీవితాధారంగా "రుస్తుం" చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ నేవీ అధికారిగా నటించారు. అక్షయ్ సరసన ఇలియానా కథానాయికగా నటించారు. అందులో అక్షయ్ ధరించిన నేవీ దుస్తులను అతని భార్య ట్వి౦కిల్ కన్నా వేలం వేయాలనుకున్నారు. దాంతో వచ్చిన డబ్బులను ఓ ఛారిటీకి ఇవ్వాలనుకున్నారు. అయితే ఏ భార్య అధికారుల యూనిఫాంలను వేలం వేయదని ఓ ఆర్మీ అధికారి ట్వి౦కిల్ ను బెదిరించారట. అంతేకాదు ఒకవేల వేలం వేస్తే ముక్కు పగులుతుందని హెచ్చరించారట. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్షయ్.. ఓ మీడియా ద్వారా స్పందించారు. యూనిఫాం ను వేలం వేయాలనుకున్నది ఒక మంచి పని కోసమే. అంతేగాని ఇలా బెదిరిస్తే ఊరుకునేది లేదు. ఈ విషయంలో నేను నా భార్యకే సపోర్ట్ చేస్తాను. నా భార్యకే అండగా ఉంటాను" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.