200 కోట్ల క్లబ్బులో "రంగస్థలం"..

SMTV Desk 2018-05-01 18:20:31  rangasthalam, 200 crores grass, ram charan, mytri movie makers.

హైదరాబాద్, మే 1 : రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" చిత్రం అనేక రికార్డులను బ్రేక్ చేసి దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దృశ్యకావ్య౦ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని 1980ల్లోకి తీసుకెళ్ళిందంటే అతిశయోక్తి లేదు. చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమ౦త నటన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. కేవలం రేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టింది. మార్చి 30 న రిలీజ్ అయిన "రంగస్థలం" కేవలం నెలరోజుల్లోనే ఇంత భారీ వసూళ్లను రాబట్టడం విశేషం. స్వయంగా ఈ విషయాన్ని ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.