ఒత్తిడి.. ఓడిస్తుంది

SMTV Desk 2018-05-01 17:54:39  Stress feeling, others, tips.

హైదరాబాద్, మే 1 : సామాజిక ఆర్ధిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ఎమోషనల్ సమస్యలతో బాధపడే యువత నిరుద్యోగులు అయ్యే అవకాశం బాగా ఉందట. ఇటీవల చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ప్రశాంతంగా, సంతోషంగా ఉండాల్సిన యువత తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళనవల్ల ఏదో కోల్పోయినట్లు ఉంటారట. ఇలాంటి వారు భవిష్యత్ లో ఉద్యోగం సంపాదించలేక బాధపడతారట. డిప్రెషన్ తో బాధపడుతున్న 16-20 ఏళ్ల వయసు వారు 32 శాతం దాకా నిరుద్యోగం పాలయ్యే అవకాశం ఉందట. 26 శాతం మంది నిరుద్యోగులుగా ఉండొచ్చు లేదా వర్కు ఫోర్సులో ఉండే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని స్టడీలో తేలింది ఇటీవల ఆర్ధిక ఆటుపోటులలో రెసిషన్ తీవ్రత పెరగడానికి ఇది ఒక కారణంగా అధ్యయన కారులు పేర్కొన్నారు. 1980-84 సంవత్సరంలో పుట్టిన ఏడువేల మంది అమెరికన్లకు మొత్తం 12 సంవత్సరాల కాలంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో ఈ స్టడీలో పరిశీలించారు. మానసిక సమస్యలు, ఒత్తిడి ప్రభావం ఉద్యోగావకాశాల మీద బాగా పడుతోందని తేలింది. ప్రారంభదశలో యువత మానసిక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వారు ఆర్ధిక ప్రయోజనాలు బాగా పొందగలరని అధ్యయనకారులు తెలిపారు.