రంగు మారుతున్నారా.. ఇలా ప్రయత్నించి చూడండి..

SMTV Desk 2018-05-01 17:36:24  skin pigmentation, others, skin problems, tips.

హైదరాబాద్, మే 1 : స్కిన్ పిగ్మే౦టేషన్ అంటే చర్మం రంగు మారడం. వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల ఈ పిగ్మే౦టేషన్ వస్తుంది. ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలో హెచ్చుతగ్గులు కూడా దీనికి మూలకారణాలు. కాబట్టి ఈ పిగ్మే౦టేషన్ తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. >> ఆలుగడ్డలో స్ట్రాచ్, చర్మాన్ని ఉత్తేజపరిచే విటమిన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆలుగడ్డ రసంతో చర్మాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల పిగ్మే౦టేషన్ తగ్గించుకోవచ్చు. >> నిమ్మరసాన్ని నేరుగా అప్లై చేయొచ్చు. లేదా ఇతర పదార్ధాలను మిక్స్ చేసి ముఖానికి రాయొచ్చు. నిమ్మరసంలో ఉండే ఆస్ట్రిజెంట్ గుణాలతో పాటు విటమిన్ ‘C’ కూడా పిగ్మే౦టేషన్ని తగ్గిస్తుంది. >> చర్మంలో మెలనిన్ ఉత్పతిని బ్యాలన్స్ చేయడానికి గంధం బాగా పని చేస్తుంది. గంధంలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి ముఖానికి రాయాలి. ఆరిపోయాక కడిగేయాలి. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. >> బాదం పౌడర్ లో, బాదం మిల్క్ కలిపి ముఖానికి రాయాలి. ఇలా తరచుగా చేయాల్సి ఉంటుంది. బాదం పాలలో విటమిన్ ‘E’ అధికంగా ఉంటుంది. >> మెలనిన్ ప్రొడక్షన్ మెయి౦టెన్ చేయడంలో బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీన్ని గుజ్జుగా చేసుకొని వారంలో రెండు సార్లు చర్మానికి రాసి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.