మొటిమలు తగ్గించే క్యాప్సికమ్

SMTV Desk 2018-05-01 12:48:39  capsicum uses, health tips, vegetable capsicum, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 30 : క్యాప్సికమ్ కొందరు ఇష్టంగా తింటారు. మరి కొందరు పెద్దగా ఇష్టపడరు. కానీ దీని వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అందరూ కావాలంటారు. >> క్యాప్సికమ్ నొప్పిని తగ్గించే ఏజెంట్ గా పనిచేస్తుంది, దీనిలో ఉండే కేయాన్ పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది. >> జీర్ణక్రియ సక్రమంగా జరగడంలో క్యాప్సికమ్ తోడ్పడుతుంది. >> డయేరియా, కడుపులో మంట వంటి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. >> క్యాప్సికమ్ ను రోజు తినే ఆహారంలో భాగం చేసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మొటిమలు లేకుండా చేసి, ముఖఛాయను పెంచడంలో క్యాప్సికమ్ అద్భుతంగా పనిచేస్తుంది. >> క్యాప్సికమ్ లో ఉండే విటమిన్ ‘A’ కళ్ళకు మంచి చేస్తుంది. క్యాన్సర్ ను నివారించేందుకు ఉపయోగపడుతుంది. >> దీనిలో ఉండే ఔషధ గుణాలు రక్తకణాలతో కలిసి క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. జుట్టు రాలడాన్ని నియత్రించాలంటే రోజు వారి ఆహారంలో క్యాప్సికమ్ ను భాగం చేసుకోవడం ఉత్తమం. >> బరువును తగ్గించి, షుగర్ లెవల్ ను నియంత్రించడంతో పాటు ఆర్ధరైటిస్, రుమాటాయిడ్స్ ను నివారిస్తుంది.