పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా..!!

SMTV Desk 2018-05-01 12:18:44  priyanka chopra, clarity about marriage, bollywood news

హైదరాబాద్, మే 1 : బాలీవుడ్ తో పాటు అటు హాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇటీవల ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కావాలంటే నల్లపూసలు, మంగళసూత్రం చూడండి అంటూ ఒక ఫొటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్‌చల్‌ చేసింది. ఈ నేపథ్యంలో తాను రహస్య పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ప్రియాంక ఖండించింది. తన ట్విట్టర్ ఖాతాలో.. "ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. అవన్నీ ఊహాగానాలే. దిష్టి తగలకుండా బ్రాస్‌లెట్ పెట్టుకున్నాను. నా పెళ్లిలో ఎలాంటి రహస్యం ఉండదు. అందరికీ చెప్పే చేసుకుంటాను" అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ సరసన "భారత్‌" లో నటిస్తున్నారు.