మహేష్ కు సితారతో డాన్స్ చాలా ఇష్టం..

SMTV Desk 2018-05-01 11:27:59  MAHESH BABU, MAHESH BABU DAUGHTER, SITARA, NAMRATHA, PARIS TOUR.

హైదరాబాద్, మే 1 : "భరత్ అనే నేను" చిత్ర విజయోత్సాహంలో మునిగి తేలుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. అతని భార్య నమ్రత కూడా సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేశ్‌ కుటుంబం విహారయాత్ర కోసం ప్యారిస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా నమ్రత సినిమా విజయం గురించి ప్రస్తావిస్తూ.. "మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్. అతని ఆనందాన్ని మాటల్లో చెప్పలేను" అన్నారు. అలాగే మహేష్ ఇంట్లో పిల్లలతో ఎలా గడుపుతారు అని అడిగిన ప్రశ్నకు.. "మహేష్‌కు సితారతో డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. కొన్ని వారాలుగా వాళ్లిద్దరూ ఒక స్టెప్పు వేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారిద్దరూ అది చేయలేకపోతున్నారు. గౌతమ్‌కి తన తండ్రిలాగే సిగ్గు చాలా ఎక్కువ. తండ్రికూతుళ్లు డ్యాన్స్ చేసే సమయంలో గౌతమ్‌ని కూడా డ్యాన్స్ చేయమని మహేష్ బలవంతం చేస్తాడు" అని తెలిపారు. ఈ సందర్భంగా ప్యారిస్ లో దిగిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు.