టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి

SMTV Desk 2018-04-30 18:51:40  tirumala tirupathi devasthanams TTD Board Members sudha murthy tirumala

తిరుమల, ఏప్రిల్ 30: ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో సుధా నారాయణమూర్తి చేత జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.