టీమ్ లో ఒక్కరైనా..

SMTV Desk 2018-04-30 18:06:47  women in office, women empowerment, hyderabad, women teams

హైదరాబాద్, ఏప్రిల్ 29 : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆఫీస్ లో ఉండే టీమ్స్ లో ఒక్కరైనా మహిళా ఉండి తీరాలని ఒక అధ్యయన౦ చెబుతున్నది. >> ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం ఒక మంచి వాతావరణానికి సంకేతం. అయితే తప్పకుండా ఒక ఆఫీస్ లో ఉండే ప్రతి టీంలో ఒక మహిళా ఉండి తీరాలని ఒక పరిశోధన చెబుతున్నది. >> ఆడవాళ్ల ఉన్న చోట వాతావరణం కూల్ అయిపోతుందని, పని కూడా త్వరగా పూర్తిపోయిందని అమెరికాలోని కరోల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని వెల్లడి చేసింది. >> ఒక టీంలో ఇద్దరు మగాళ్లు ఉంటే ఏదైనా అంశంపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులభం కాదు. అదే ఇద్దరూ వ్యక్తులు కలిగిన టీంలో ఒక మహిళా, ఒక పురుషుడు ఉంటే మాత్ర౦ వారి అభిప్రాయాలూ కలవకపోయినారాజీ కుదురుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. >> ఒకవేళా టీంలో మొత్తం పురుషులు ఉంటే పరస్పరం ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తారంటా. అదే మహిళా జోక్యం చేసుకున్న టీంలో సత్వర నిర్ణయాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు సులభంగా, స్వల్ప కాలంలో తీసుకుంటారు. ఇద్దరు మహిళలు ఉన్న టీంలో కూడా సానుకూల ఫలితాలు సాధించోచ్చని ఈ పరిశోధన చెబుతున్నది.